సీఎం జగన్‌కు సిపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

k ramakrishna
k ramakrishna

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సిపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు జిల్లా మొగలవల్లిలో నాసిరకం నిర్మాణాలు బయటపడ్డాయని అలా నిర్మించిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్థానిక పీహెచ్‌సీని నాసిరకంగా నిర్మించారని సీఎంకు రాసిన లేఖలో ఆయన ప్రస్తావించారు. ఆరేళ్లు గడచిన తర్వాత భవన నిర్మాణంలో నాణ్యతా లోపాలు వెలుగుచూశాయన్నారు. పైకప్పు పెచ్చులూడి కొన్ని గదులు మూసివేశారని, రోగులు ఆసుపత్రికి రావాలంటే భయపడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఇంజనీర్లను సస్పెండ్‌ చేసి, గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ ఖర్చును గుత్తేదారు నుంచి తిరిగి రాబాట్టలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/