సీఎం జగన్ ఫై సిపిఐ నారాయణ విమర్శలు

ఏపీ సీఎం , వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫై సిపిఐ నారాయణ విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక తన గుణం మారిందని విమర్శించారు. అమరావతి లోని వెంకటపాలెం గ్రామంలో రైతుల పాదయాత్ర లో బిజేపి నాయకులు కామినేని శ్రీనివాస్, టిడిపి ఏలూరు మాజీ ఎంపీ మాగంటి, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని అని హామీ ఇచ్చి సీఎం అయినా జగన్.. సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందని మండిపడ్డారు. పాదయాత్రలు, ర్యాలీలు అంటే జగన్ కు ఎందుకు కోపం… సీఎం పదవి నుండి జగన్ దిగిపోవాలని రైతులు పాదయాత్ర చేయడం లేదు…అమరావతి రాజధాని కావాలనే చేస్తున్నారని అన్నారు. మీరు మీ నాన్న పాదయాత్రలు చేసే సీఎంలు అయ్యారని.. పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఇక అమరావతి రైతులు దాదాపు ఏడాది కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు చేసిన మొదటివిడత పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే… అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కానీ ప్రభుత్వం… ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతోంది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా, అఫిడవిట్‌లతో కాలయాపన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘బిల్డ్‌ అమరావతి- సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంతో అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో మహాపాదయాత్ర చేస్తున్నారు. నేడు అమరావతిలో మొదలై వెయ్యి కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర… నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యభగవానుడి చెంతకు చేరనుంది.