కేసీఆర్ జాతీయ పార్టీ ఫై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్

తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అతి త్వరలో జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ని ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెలాఖరులో దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్టీను కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. పార్టీ పేరును ‘భారత్‌ రాష్ట్రీయ సమితి’ అని డిసైడ్ చేసినట్లు వినికిడి. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ఫై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు స్పందించగా..తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

కేసీఆర్‌ త్వరలో దిల్లీకి వెళ్లి కార్యకలాపాలను ప్రారంభించాలనుకోవడం మంచిదేనని అన్నారు. రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌కు స్పష్టమైన వైఖరి ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున అభ్యర్థి ఒకరే అయితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడుతున్నదని, కేసీఆర్‌ కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్న క్రమంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చే రాజకీయ ఎత్తుగడలు వేయాలని సూచించారు. ఇక ఏపీ సీఎం జగన్‌ సీఎం కేసీఆర్‌కు మంచి మిత్రుడైనందున ఆయనను కూడా కలుపుకొని పోవాలని సూచించారు.

ఇక రాష్ట్రపతి ఎన్నికకు సంబదించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. జులై 18న పోలింగ్​ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 15న ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌ నోటిఫికేష‌‌‌‌న్ విడుద‌‌‌‌లవుతుందని చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ తెలిపారు. నామినేష‌‌‌‌న్ దాఖ‌‌‌‌లుకు చివ‌‌‌‌రి తేదీ జూన్ 29. నామినేష‌‌‌‌న్ల ప‌‌‌‌రిశీల‌‌‌‌న జూన్ 30 న జ‌‌‌‌రుగుతుంది. నామినేష‌‌‌‌న్ల ఉప సంహ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు జులై 2 వ‌‌‌‌ర‌‌‌‌కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించారు. జులై 21న ఢిల్లీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జులై 18న పార్లమెంటులో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీల్లో ఓటు వేయవచ్చని, అయితే ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాజీవ్​ కుమార్​ పేర్కొన్నారు.