గత ప్రభుత్వంలానే ఉంది జగన్‌ పాలన కూడా

CPI Narayana
CPI Narayana

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌ పాలన కూడా టిడిపి పాలన లాగే ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. టిడిపి పాలన కక్ష్య సాధింపులతో నడుస్తుందని విమర్శించి వైఎస్‌ఆర్‌సిపి.. ఇప్పుడు అదే తరహాలో పాలన కొనసాగిస్తుంని ఆయన అన్నారు. నారాయణ మాట్లాడుతూ.. గతంలో తాను జగన్‌ పాలన బాగుంటుందని భావించానని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పారు. ముందుముందు జగన్‌కు చాలా భవిష్యత్‌ ఉంది, చేతిలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పాలన ఇదే మాదిరిగా కొనసాగితే రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని నారాయణ సిఎం జగన్‌ను హెచ్చరించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దాని ఆలోచనలకు తగిన విధంగా అధికారులు పని చేస్తారని ఆయన అన్నారు. అంతెందుకు గత ఎన్నికలకు ముందు టిడిపిని అణచివేసేందుకు బిజెపి ప్రభుత్వం జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి సిఎస్‌ పదవిని కట్టబెట్టలేదా? అని నారాయణ ప్రశ్నించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/