సిఎం జగన్‌కు లేఖ రాసిన సీపీఐ నేత రామకృష్ణ

  • రీ టెండరింగ్ ఆలోచనను విరమించుకోండి
RamaKrishna
RamaKrishna

అమరావతి: సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దుచేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీటెండరింగ్ చేపట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని కోరారు. వాస్తవ ధర కంటే 14 శాతం తక్కువ మొత్తానికే చేపట్టేందుకు నవయుగ కన్ స్ట్రక్షన్స్ ముందుకు వచ్చిందని రామకృష్ణ తెలిపారు.

కాంక్రీట్ పనులు చేయడంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని గుర్తుచేశారు. కాబట్టి అదే కంపెనీతో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగించాలని సూచించారు. రీటెండరింగ్ వల్ల నిర్మాణ వ్యయం, పనుల్లో జాప్యం పెరుగుతుందని చెప్పారు. కాంట్రాక్టులను మార్చడం వల్ల ప్రాజెక్ట్‌ భద్రత ప్రశ్నార్థకం అవుతుందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/