రామకృష్ణను అడ్డుకున్న రాజమండ్రి పోలీసులు

హోటల్ లోనే హౌస్ అరెస్టు

CPI Leader Ramakrishna
CPI Leader Ramakrishna

Rajahmundry: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను రాజమండ్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయన బస చేసిన రివర్ బే హోటల్ లోనే హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తామని స్పష్టంచేశారు.

రామకృష్ణ హౌస్ అరెస్టును నిరసిస్తూ హోటల్ గేటు ముందు ధర్నాకు దిగిన సీపీఐ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/