నేడు సిపిఐ కార్యవర్గ సమావేశం

cpi
cpi

హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ సిపిఐ మద్దతు కోరడంతో ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గసమావేశం నేడు మగ్దూం భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్‌కు మద్దతు అంశంపై సిపిఐ సుధీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌కు బాసటగానిలిచి తెలంగాణ వాదా న్ని వినిపించిన సిపిఐ హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ ఆపార్టీ కార్యవర్గం తీర్మాణం చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే రాష్ట్ర రాజకీయాలు, హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, డిసె ంబర్ 20,21,22,23 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న సిపిఐ నిర్మాణ మహాసభ ఏర్పాట్లను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సమావేశం లో టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంతో పాటు పలు రాజకీ య అంశాలుండటంతో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు,సీనియర్ నాయకుడు అతుల్‌కుమార్ అంజాన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/