పవన్‌కు సీపీఐ, సీపిఎం నేతలు లేఖ

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: సీపీఐ, సీపీఎం పార్టీల తరుపున ఆపార్టీ నేతలు రామకృష్ణ, మధులు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేఖను రాశారు. ఇసుక సంక్షోభంపై విశాఖలో లాంగ్‌ మార్చ్‌కు తమ సంఘీభావం తెలిపారు. ఇదే కార్యక్రమానికి బిజెపి సహకారం తీసుకోవాలనుకుంటున్న… పవన్ వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. పవన్ చేపట్టే కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నామన్నారు. ఇసుక సమస్యపై ఇప్పటికే సీపీఐ, సీపీఎం పార్టీలు… వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయన్నారు. పవన్ ఈ విషయాన్ని గమనించారని భావిస్తున్నామని రామకృష్ణ, మధు పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/