సిపెక్‌ పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు పెనుభారం

cpec project
cpec project

వాషింగ్టన్‌: చైనాలోని జింగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టు వరకు ఆర్థిక నడవా సిపెక్‌ను నిరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయి కూడా. కాగా ఈ కారిడార్‌ కారణంగా పాకిస్థాన్‌కు ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని అమెరికా హెచ్చరిస్తోంది. ఓవైపు పాక్‌లో నిరుద్యోగ సమస్యలు ఉంటే, చైనా మాత్రం ఈ ప్రాజెక్ట్‌లో కార్మికుల్ని, ఉత్పత్తిదారుల్ని తమ దేశానికి చెందిన వారిని భాగం చేస్తుందని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా విభాగం సెక్రటరీ అలైస్‌ వెల్స్‌ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ కారణంగా పాక్‌ రానున్న ఆరేళ్లలో భారీ మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అంతేకాకుండా పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థపై సవాలు విసిరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికా కంపెనీలు ఉబర్‌,పెప్సికో, కోకా-కోలా లాంటి కంపెనీలు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ ప్రాజెక్ట్‌ స్థానంలో వాటికి అవకాశం కల్పిస్తే పాక్‌ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని వెల్లడించారు. కాగా ఈ కారిడార్‌ కోసం పాక్‌ చైనా నుంచి భారీగా రుణాలు పొందింది. పాక్‌లో చైనా పలు పోర్టులను ఆధునికీకరించడం, రైలు, రోడ్డు మార్గాలు నిర్మించనుంది. అయితే ఈ కారిడార్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా సాగుతుండడంతో భారత్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh