పబ్ ఓనర్లకు వార్నింగ్ ఇచ్చిన సీపీ స్టీఫెన్ రవీంద్ర ..

పబ్ ఓనర్లకు వార్నింగ్ ఇచ్చారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. పబ్బుల యాజమాన్యాలతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ… పబ్ నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. బ్యాకప్ తో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పబ్ లకు వచ్చే కస్టమర్లను పరీక్షించటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

రాత్రి 10గంటల తర్వాత సౌండ్‌ బయటకు రావొద్దని సూచించారు. హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించి తీరాలన్నారు సైబరాబాద్ సీపీ. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీరియస్ అయ్యారు. పబ్ నిర్వహణలో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, వారి నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. నిర్ణీత సమయాల్లోనే పబ్స్ నడపాలని, లేకుంటే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు.