ఏపీకి భారీగా చేరుకున్న కొవిషీల్డ్ డోసులు

జిల్లాలకు విడతల వారీగా తరలింపునకు ఏర్పాట్లు

Covshield doses reach heavily to the AP
Covshield doses reach heavily to the AP

Vijayawada: ఆంధ్రప్రదేశ్ కు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 4.44 లక్షల డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి యూనిట్ కు అధికారులు తరలించారు. జిల్లాలకు విడతల వారీగా తరలిస్తారు. ఇదిలా ఉండగా , రాష్ట్రంలో ఇప్పటిదాకా 79,00,175 మందికి వ్యాక్సిన్లు అందించారు. వారిలో రెండు డోసులు అందుకున్నవారు 23,44,455 మంది ఉన్నారు. ఇంకా 55 లక్షల మందికి పైగా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/