హైటెక్స్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజానీకం

hyd-covid Vaccination Drive in Hitex
Covid Vaccination Drive in Hitex grounds

Hyderabad: హైదరాబాద్ లో హైటెక్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికోవర్ ఆస్పత్రి కలిసి పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్‌ ఉంటుందని తెలిపారు. హైటెక్స్‌లో మొత్తం 3 హాళ్లలో 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలనే లక్ష్యంతో డ్రైవ్‌ ప్రారంభించిన తొలిగంటలోనే 5 వేల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్‌ స్తంభించి పోయింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/