శ్రీశైలం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరి

దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు

covid vaccination document is mandatory for Srisailam online registration
covid vaccination document is mandatory for Srisailam online registration

Srisailam : రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం నిలుపుదల చేసినట్టు పేర్కొన్నారు . అదేవిధంగా అన్న ప్రసాద వితరణ, పాతాళ గంగ లో పుణ్య స్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేయటం జరిగిందన్నారు. రోజుకు 4 విడతల్లో సామూహిక అభిషేకాలు ఉంటాయన్నారు. .ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే శీఘ్ర అతిశీఘ్ర దర్శనం టికెట్లు ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. ఇక ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసినట్టు పేర్కొన్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/