ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో కోవిడ్‌ పరీక్షలు

మరో పది రోజులలో అందుబాటులోకి రానున్న ల్యాబ్‌

testing lab
testing lab

ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల కేంద్రాలను పెంచుతు పెంచుతు పోతుంది. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కోవిడ్‌-19 పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో పది రోజుల్లోగా ఈ ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కరోనా పరీక్షల కోస ం నమూనాలను హైదరాబాద్‌కు పంపడం వల్ల ఫలితాలలో జాప్యం ఏర్పడుంది. ఇక్కడ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే సమీప జిల్లాల ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించే సిబ్బందికి నేటినుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/