కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే

గుంటూరుజిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

Guntur District Collector Samuel Anand Kumar
Guntur District Collector Samuel Anand Kumar, JC Pranshanti

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌-19 పై పదిరోజుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కలెక్టరేట్‌లో మతపెద్దలతో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు..

ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అక్టోబర్‌ 15 నుంచి అన్‌లాక్‌ 6.0లో ఉన్నామని, నియమ నిబంధనలకు లోబడి దాదాపు అన్ని కార్యక్రమాలను ఓపెన్‌ అప్‌ చేయటం జరిగిందన్నారు.

ఈ ఓపెన్‌ అప్‌ అన్ని రంగాల్లో ఆపరేటింగ్‌ సొసైటీలో అన్‌లాక్‌ నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు.

ఎక్కువ సమూహాలుగా ఏర్పడే అన్ని మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలని చాలా కాలంగా మూసివేయబడి ఉన్నాయన్నారు.

ఇపుడు అన్ని మతాలకు చెందిన మందిరాలు తెరుచుకుంటున్నందున ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను ముద్రించి ప్రార్తనా మందిరాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు

.కరోనా సమయంలో మత పెద్దలందరూ ప్రభుత్వానికి చాలా సహకరించారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండుగలు జరుకున్నారని అన్నారు.

భగవంతుడి సర్వాంతర్యామి అని , కాబట్టి ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు.

. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్‌ దినేష్‌కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్‌రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ యాస్మిన్‌, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, మతపెద్దలు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/