కోవిడ్ నియంత్ర‌ణ‌లో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం

జీఎస్టీ, నోట్ల ర‌ద్దు, కోవిడ్‌19 విఫ‌లం.. హార్వ‌ర్డ్ స్కూల్ అధ్య‌య‌నం..రాహుల్‌

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడి ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అమ‌లులో కూడా బిజెపి ప్ర‌భుత్వం దారుణంగా విఫ‌ల‌మైన‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. అయితే ఈ వైఫ‌ల్యాల‌పై భ‌విష్య‌త్తులో హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్ అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు రాహుల్ వెల్ల‌డించారు. భ‌విష్య‌త్తులో ఇవే హెచ్‌బీఎస్ కేస్ స్ట‌డీలంటూ రాహుల్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. త‌న పోస్టుకు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ప్ర‌ధాని మోడి జాతిని ఉద్దేశిస్తూ ప్ర‌సంగిస్తుంటే.. ఆ వీడియోలో వైర‌స్ కేసుల గ్రాఫ్ పెరుగుతూ పోతుంది.


తాజా తెలంగాణ సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/