ఆగస్టు నాటికి 20 లక్షల కరోనా కేసులు నమోదవుతాయి

కేంద్ర ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకోవాలి

rahul-gandhi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు 10 లక్షలు దాటిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వం పోరాడుతున్న తీరు సరిగ్గా లేదని, దేశంలో‌ కేసుల సంఖ్య ఈ వారం 10 లక్షలు దాటుతుందని నాలుగు రోజుల క్రితమే రాహుల్ గాంధీ హెచ్చరించారు. తాను చెప్పినట్లుగానే కేసుల సంఖ్య ఆ మార్కును దాటిన విషయాన్ని రాహుల్ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. ‘దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇదే వేగంతో కొవిడ్‌19 కేసులు వ్యాప్తి చెందడం కొనసాగితే ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా సోకిన వారు 20 లక్షల కంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/