అగ్రరాజ్యంలో ఆరు లక్షలు దాటిన కరోనా మరణాలు

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా మరణాలు మంగళవారం ఆరు లక్షలు దాటాయి. సీఎస్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 33.4 మిలియన్లకు పెరగ్గా.. మరణాలు 6,00,012కు చేరాయి. కాలిఫోర్నియాలో అత్యధికంగా 63,191 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూయార్క్‌లో 53,558, టెక్సాస్‌లో 51,940, ఫ్లోరిడా 37,265 మరణించినట్లు సీఎస్ఎస్ఈ పేర్కొంది. పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్‌, జార్జియా, మిచిగాన్‌ ఒహియోల్లో 20వేలకుపైగా మరణాలు నమోదయ్యాయని జిన్హువా తెలిపింది. కరోనా కేసులు, మరణాలతో అమెరికా విలవిల్లాడింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో దాదాపు 20శాతం, మరణాల్లో 15శాతానికిపైగా అగ్రరాజ్యంలోనే ఉన్నాయి.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/