ప్రపంచవ్యాప్తంగా కోటి 39 లక్షలు దాటిన కరోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 5,92,690

worldwide corona

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,39,49,386 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,92,690 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 82,78,974 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 36,95,025 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,41,118 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 16,79,633 మంది కోలుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/