ప్రపంచవ్యాప్తంగా కోటి 30 లక్షలు దాటిన కేసులు
మొత్తం కేసులు సంఖ్య 1,30,36,587
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,30,36,587 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,71,574 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 75,82,426 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 34,13,995 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,37,782 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 15,17,084 మంది కోలుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/