మహరాష్ట్రలో ఒక్క రోజే 2,361 కేసులు నమోదు

కేసులు, మరణాలలో దేశంలోనే ముందున్న మహారాష్ట్ర

corona virus
corona virus

ముంబయి: కరోనా మహమ్మారి మహరాష్ట్రలో విలయతాండవం చేస్తుంది. నిన్న ఒక్క రోజే 2,361 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరుకుంది. అలాగే, తాజాగా 76 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,362కు పెరిగింది. అటు కేసుల్లోనూ, ఇటు మరణాల్లోనూ దేశంలోనే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇక, నిన్న ఒక్క రోజే 779 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 37,543 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం ఒక్క ముంబయిలోనే ఉన్నాయి. నగరంలో నిన్న ఒక్క రోజే 1,413 కేసులు వెలుగు చూశాయి. దీంతో ముంబయిలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,789కు పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/