ఏపిలో మరో 54 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,841

Corona Cases in Andhra Pradesh
Corona Cases in Andhra Pradesh

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 9,858 శాంపిళ్లను పరీక్షించగా మరో 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,841అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 824 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,958 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో కరోనాతో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/