ప్రపంచవ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,74,339

coronavirus- worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 91,88,362 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 49,37,282 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 23,88,153 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,22,610 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,02,929 మంది కోలుకున్నారు.


తాజా వీడయోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/