ప్రపంచవ్యాప్తంగా 36 లక్షలకు పైగా కరోనా కేసులు

COVID-19 Infected Worldwide

కరోనా మహమ్మారి కేసులు ప్రపంపచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. గత 24 గంటల్లో 2,268 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు మొత్తం 36,45,539 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 155 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,52,396 మంది మరణించారు. కాగా 12 లక్షల మందికిపైగా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఇక స్పెయిన్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో మొత్తం 2,45,567 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఇప్పటి వరకు మొత్తం 2,09,328 కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/