ఈ విషయాన్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోబోం
కరోనా వైరస్ చైనా నుంచే వచ్చింది

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కరోనా మహమ్మారి చైనా నుండే వచ్చిందని చైనాపై మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన మరోసారి చైనా పై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆఫ్రికన్ – అమెరికా నేతలతో మిషిగన్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని అన్నారు. ఈ విషయంలో తాము చాలా అసంతృప్తిగా ఉన్నామని, ఈ మధ్యే చైనాతో ఓ ఒప్పందంపై సంతకాలు చేశామని, ఆ సిరా ఇంకా ఆరకముందే ఈ వైరస్ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాము ఏ మాత్రం తేలిగ్గా తీసుకోబోమని తెలిపారు. కాగా, కరోనా విషయంలో అమెరికా చట్టసభ ప్రతినిధుల నుంచి ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా పుట్టినిల్లు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని రిపబ్లిన్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశం వల్లే ప్రపంచానికి కరోనా చేరిందని, విపత్కర పరిస్థితులు వచ్చాయని, చైనాపై ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/