మా దేశంలో కరోనా నియంత్రణలో ఉంది

ఐరాస సర్వసభ్య సమావేశంలో కిమ్ సోంగ్

మా దేశంలో కరోనా నియంత్రణలో ఉంది
north-korean-ambassador

ఉత్తర కొరియా: ఉత్తర కొరియాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, కరోనా నియంత్రణలోనే ఉందని ఆ దేశ ఐక్యరాజ్య సమితి రాయబారి కిమ్ సోంగ్ తెలిపారు. నిన్న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన కరోనా కారణంగా విదేశీయులు ఎవరూ తమదేశంలో అడుగుపెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని హై అలెర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని తమ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యాంటీ వైరస్ ప్రచారాన్ని ప్రారంభించినట్టు సోంగ్ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/