కోవిడ్‌-19 వైద్యపరీక్షలు-2

ఆరోగ్య భాగ్యం

covid-19 Medical Tests
covid-19 Medical Tests

ఆంటిజెన్‌ టెస్ట్‌ : వైరస్‌ ఉపరితలంపైనున్న ప్రత్యేకమైన ప్రోటీన్స్‌ని బట్టి ఈ టెస్ట్‌ చేస్తారు. 15-30 నిమిషాల్లో ఫలితాలు తెలుస్తాయి కాబట్టి ఎక్కువ మందికి త్వరితగతిన చేయవచ్చు.

కోరనా వైరస్‌పై స్పైన్‌ ప్రొటీన్స్‌ ఉండి ఇవి మనుష్యుల్లోని ముక్కు, గొంతు, నోరులోని ఎపిధిలియల్‌ కణాల్లోకి ప్రవేశించి వ్యాధిని కల్గిస్తాయి.

స్వాబ్‌ని వైరస్‌ని ఆక్టివేట్‌ చేసే పొల్యూషన్‌లో ఉంచుతారు.

దీంట్లో కరోనా వైరస్‌ ప్రొటీన్స్‌ని ఎదుర్కొనే క్యాప్సిడ్‌ (ఎన్‌) ప్రొటీన్‌ ఉండడం వల్ల 15-30 నిమిషాల్లో పాజిటివ్‌ వస్తే రెండు లైన్స్‌ వస్తాయి.

34-89% సెన్సివిటీ కల్గిన ఈ టెస్ట్‌వల్ల రోగ లక్షణాలు లేని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ వారిని, ముక్కు కారడం, జలుబు వంటి ప్రారంభ దశలో వ్యాధి లక్షణాలున్నప్పడు చేస్తారు.

20-30% మందిలో కోవిడ్‌-19 ఉన్నప్పటికీ నెగటివ్‌ రావచ్చు. అలాంట ప్పుడు పిసిఆర్‌ టెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణాలు 4 ఉన్నాయి.

శాంపిల్‌ కలెక్షన్‌ చేసినప్పుడు రోగిలో వైరల్‌ తక్కువగా ఉండడం. సరిగా శాంపిల్‌ కలెక్షన్‌ చేయకపోవడం

శాంపిల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సరిగా లేకపోవడం. ల్యాబ్‌ టెక్నిక్‌ సరిగా లేకపోవడం. సరైన వైద్య
సిబ్బంది లోపం. మెషిన్‌ ప్రాబ్లమ్‌, ఆపరేటింగ్‌సరిగా లేకపోవడం వల్ల ఒక్కొసారి ఫలితాలుసరిగా రాకపోవచ్చు.

దీనిని దాదాపు ఇ,ఎస్‌,ఎన్‌,ఓఆర్‌ ఎఫ్‌ఎల్‌ఎ, ఒఆర్‌ఎఫ్‌ మరియు ఆర్‌డిఆర్‌పి అనే 6 రకాల ఆంటిజెన్స్‌ని ఉపయోగిస్తారు. మనదేశంలో ఆంటిజెన్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ న్నారు.

ఆంటిజెన్‌ వల్ల డెస్ట్‌ నెగటివ్‌ వస్తే కొరనాలేనట్లు లెక్క. ఆంటిజెన్‌ టెస్ట్స్‌ ఒక దేశంలో మరొక దేశంలో వేరు వేరుగా ఉంటాయి.

ఆంటిజెన్‌ని బట్టి ఒక దేశంలో పాజిటివ్‌ వస్తే మరొక దేశంలో నెగటివ్‌ వస్తుంది. దీనిని రూ.450 ఖర్చు అవుతుంది.

స్టాండర్డ్‌ ఫాస్ట్‌ ఆంటిజెన్‌ కోవిడ్‌ టెస్ట్‌:

నాసల్‌ ల్వాబ్‌ని బట్టి 15-30 నిమిషాల్లో చేయవచ్చు. వీటిలో నెగటివ్‌ వచ్చినా కోరనా వ్యాధి లక్షణాలుంటే పిసిఆర్‌ టెస్ట్‌ చేసినప్పుడు పజిటివ్‌ వస్తుంది.

ఆంటిబాడీ లేదా సీరాలాజికల్‌ టెస్ట్‌ : వైరస్‌ వ్యాప్తిని అంచనా వేయడానికి వ్యాధి వ్యాపించినప్పుడు సర్వలెన్స్‌ రిపోర్ట్‌ కోసం, ఈ టెస్ట్‌ చేస్తారు.

అంతే కాకుండా దీనివల్ల వ్యాధి మరణాల రేటు, జనాభాలో రోగనిరోధక శక్తి స్థాయిని, ఎంత మంది వ్యాధిని కల్గి ఉన్నారు అని ఇమ్యూన్‌ సిస్టిమ్‌ రెస్పాన్స్‌ని నిర్ణయించ వచ్చు.

కరోనాని ఎదుర్కొనే ఐజిజి, ఎంఎం వంటి వైరస్‌ రక్తంలో ఇన్ఫెక్షన్‌ సోకినా 9-26 రోజులకి ఏర్పడతాయి.

ఇది ఇన్‌డైరక్ట్‌ పద్ధతి. చేతి వేలి నుండి తీసిన శాంపిల్‌ (రక్తం చుక్కల్ని) ప్రత్యేకమైన క్యాసెట్‌ కాట్రిడ్జ్‌లో ఉంచినప్పుడు దీనిలోని వైరల్‌ ప్రోటీన్స్‌ ప్రోటీన్స్‌ రక్తంలోని ఆంటి బాడీస్‌తో కలవడం వల్ల 2 లైన్స్‌ ఏర్పడతాయి.

దీని వల్ల అరగంటలో ఫలితాల్ని తెలుసుకోవచ్చు.దీనికి రూ. 500/- ఖర్చు అవుతుంది.


ఇతర టెస్ట్స్‌ :ట్రూనాట్‌ టెస్ట్‌ లేదా చీప్‌ బేస్ట్‌ టెస్ట్‌ : దీన్ని కంటెన్మెంట్‌ జోన్స్‌లో ఫలితాలు త్వరగా తెలుసుకోవాడానికి ఉపయోగిస్తారు.

బ్యాటరీతో పనిచేసే ఈ పోర్టబుల్‌ రీటోమేటిక్‌ మేషిన్‌లో సార్స్‌ కొరనా వైరస్‌ 2 ఇ జీన్‌ ఉండి కొరనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఎ జోన్‌తో కలవడం వల్ల అరగంటలో ఫలితాలు వస్తాయి.

ముక్కు గొంతు నుండి తీపిన స్వాబ్‌ శాంపిలోని మెషిన్‌లో ఉంచాలి. దీంట్లో వైరస్‌ని గుర్తించే కొన్ని చుక్కల సొల్యూషన్‌ని క్యాట్రాడ్జ్‌లో వేయాలి ప్రీ ప్రోగ్రామ్డ్‌ రియక్షన్‌).

శాంపిల్‌లోని న్యూక్లియర్‌ దీసిడ్స్‌/జెనిటిక్‌ మెటిరీయల్‌ని బట్టి ఇది ఆర్‌టిపిసిఆర్‌ పద్ధతిని పాటిస్తుంది.

ప్యూర్‌ఫైడ్‌ న్యూక్లియిక్‌ ఆసిడ్‌ని గడ్డకట్టన ఆర్‌టిపిసిఆర్‌ రియెజెంట్‌తో చిన్న ట్యూబ్‌లో ఉంచి దీన్ని మైక్రోచిప్‌లో ఉంచి వేరే మెషిన్‌లో ఉంచినప్పుడు ఫలితాలు తెలుస్తాయి.

దీన్నే న్యూక్లియిక్‌ ఆసిడ్‌ ఆంప్లికేషన్‌ టెస్ట్‌ లేదా జెనెక్స్‌పెర్ట్‌ టెస్ట్‌ అని అంటారు. ఇంది సంక్రమణకుప్రతిస్పందనగా ఉత్పత్తి అయ్యే ఆంటిబాడీస్‌ని గుర్తించే పద్ధతి.

సోథెర్మల్‌ న్యూక్లియిక్‌ ఆసిడ్‌ ఆంప్లికేషన్‌ టెస్ట్‌ :

వీటిని చైనా, ఫ్రాన్స్‌, జర్మ నీ, హండ్‌కాంగ్‌, జపాన్‌, యుకె, యుఎస్‌లో హూలెవల్‌ జీనోమ్‌ ఐసోథె ర్మల్‌ ఆంప్లికేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షిస్తారు.

ఫ్లోరోసెంట్‌ ట్యాస్స్‌ ఉన్న ప్రత్యేక మెషీన్‌లో సిఆర్‌ఉఎస్‌పిఆర్‌ ఎంజైమ్‌ స్వీకెన్స్‌ఉన్న పేపర్‌ స్ట్రిప్‌ని ఉంచినప్పుడు రంగు మారుతుంది.

దీన్ని బట్టి సులభంగా డైరక్ట్‌గా డిఎన్‌ఎని గుర్తించి టెస్ట్‌ ఫలితాల్ని తెలుసుకోవచ్చు.

ఎలీపా టెస్ట్‌ :

రక్తం/ప్లాస్మా, వైరస్‌ ప్రాటీన్స్‌తో ఉన్న ప్లేట్‌పై ఉంచినప్పుడు కలర్‌ ఫ్లోరోసెంట్‌లైతే సిన్నల్స్‌ని బట్టి ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

వైరస్‌ వృద్ధి పొందే కణాల్ని కల్చర్‌టెస్ట్‌ చేసే పద్ధతి ద్వారా మందుల్ని ప్రయోగాత్మకంగా పరిశీలించే పద్ధతి.

ఈ విధంగా ప్రభంలిన కోరనా వైరస్‌ వివిధ టెస్ట్‌ ద్వారా గుర్తించి కోవిడ్‌-19 వ్యాప్తిని ముందు జాగ్రత్తల ద్వారా తగిన చికిత్స సకాలంలో తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు.

డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/