కోర్టుకు హాజరైన అచ్చెన్నాయుడు

acchenaidu
acchenaidu

అమరావతి: గత నేలలో ఎన్‌ చంద్రబాబునాయుడు నేతృత్వంలో టిడిపి పార్టీ చేపట్టిన చలో ఆత్మకూర్‌ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గోన్నారు. ప్రజాస్వామ్యన్ని కాపాడటం మరియు మానవహక్కుల పరిరక్షణం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఆ సంధర్భంలో అచ్చెనాయుడు కొత్తగా వచ్చిన వైఎస్‌ఆర్‌సిపి పార్టీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌ పార్టీ రాజకీయ హింసకు పాల్పడుతుందని తమ పార్టీ సంబందించిన కార్యకర్తలనే హత్య చేశారని అన్నారు. చలో ఆత్మకుర్‌కు అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీనితో అచ్చెన్నాయుడు పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వలన పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. ఆ కేసు సంబందించి ఈ రోజు కోర్టులో హజరయ్యారు. కోర్టు వాదనలు విన్న తర్వాత రూ.50 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేశారు. కోర్టు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎప్పుడైనా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వైకాపా నేతలకు అచ్చెన్నాయుడు సవాల్‌ విశిరారు. అమరావతి బోత్స సత్యనారయణ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయాన్నారు. తమ హయంలో అమరావతిలో రూ.8వేల కోట్ల పనులు జరిగితే రూ.30వేల కోట్ల అక్రమాలు ఎలా జరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. ఇప్పుడు అధికార పార్టీకి తొత్తుగా మారడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/