అనుక్షణం తోడుగా

Happy Couple
Happy Couple

జీవితభాగస్వామి అంటే అనుక్షణం తోడుగా నిలిచేవారని అంటారు. భార్యాభర్తల ఆలోచనా విధానం ఒకేలా ఉండాలని ఎక్కడా లేదు. కానీ నమ్మకం ప్రేమను పండిస్తుంది. ఒక అపరిచిత వ్యక్తిని కూడా ఆ క్షణంలో హృదయ పూర్వకంగా స్వీకరిస్తుంది. ఇది వారిలో భద్రతా భావాన్ని, సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శారీరకంగా స్వీకరించేది కొంత సమయం వరకే పరిమితమై ఉంటుంది. మనసుతో స్వీకరించింది జన్మజన్మల బంధంగా రూపొందుతుంది.

అందుకని మీ బంధాన్ని మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా స్వీకరించి ప్రేమతో వ్యవహరించండి. ఏ సంబంధంలోనైనా సహకారం అవసరం అవ్ఞతుంది. కానీ రాజీకాదు. జీవిత భాగస్వామికి తగినంత ఆదరణ లభించినప్పుడే వారిలో ప్రేమాభిమానాలు పుట్టే అవకాశం ఉంటుంది. ఎదుటివారిని ఓడించేందుకు జీవితం ఒక ఆట కాదు. జీవితం ఒక బండి లాంటిది. భార్యా భర్తలు ఇద్దరూ దానికి చక్రాల లాంటివారు. ఏ ఒక్కరు లేకపోయినా బండి నడవదు. అందుకని ఇద్దరూ ఒకరికోసం ఒకరు బతకాలి. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించాలి. పెళ్లి సంబంధం నమ్మకం మీద నిలిచి ఉంటుంది. అసలు ఈ సంబంధాన్ని నమ్మకంతోనే గుర్తిస్తారు. పరస్పరం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దాపరికం లేకపోవడం, పరస్పరం గౌరవించుకోవడం ఈ బంధానికి ఎంతో అవసరం. ఈ సంబంధం ఎంతకాలం నిలబడి ఉందనేది నమ్మకంమీదే ఆధారపడి ఉంటుంది.

Beautiful Couple


ఒకసారి కష్టం, ఒకసారి సుఖం: ఒకసారి కష్టం, మరోసారి సుఖం లభించడం జీవిత వేదాంతం. వైవాహిక జీవితంలోని ఫిలాసఫీ ఇది. జీవితంలో కష్టసుఖాలు వస్తూనే ఉంటాయి.
ఈ కష్టసుఖాల్లో తన జీవిత భాగస్వామికి మరింత ఎక్కువ ఉత్సాహాన్ని నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడాలి. అప్పుడే వారు ఆ కష్టాల సంద్రంలోంచి బయటకు రాగలరు. అది జీవిత భాగస్వామికే సాధ్యం.
తోడు నీడ: జీవితంలో కష్టాలు రావడం, పోవడం జరుగుతూనే ఉంటాయి. సరైన తోడు ఎవరో అలాం టి సమయంలోనే తెలుస్తుం ది. బంధంలో బంధింపబడడం మాత్రమే వైవాహిక సంబంధానికి గుర్తు కా దు. ప్రతిక్షణం, ప్రతిస్థితిలో జీవిత భాగస్వామికి తోడుగా నిలవడమే వివాహబంధానికి గీటురాయి.