వీర జవాన్లకు జాతి నివాళి

jawan amar rahe
jawan amar rahe

అప్పటి కప్పుడే తక్షణ నిర్ణయాలు
నేడు అఖిలపక్ష సమావేశం
మృతుల కుటుంబాలకు రాష్ట్రాల ఆర్ధికసాయం
న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన సంఘటనతో దేశం మొత్తంఅప్రమత్తం అయింది. ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరసమావేశం నిర్వహించి రక్షణరంగానికి పూర్తిస్వేఛ్ఛనివ్వడం, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు అధికారాలిస్తున్నట్లు ప్రకటించడంతో సైనిక బలగాలకు కొంత నైతిక బలాన్ని తెచ్చారు. అంతేకాకుండా శనివారం పార్లమెంటు లైబ్రరీ హాలులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ జమ్ముకాశ్మీర్‌కు వెనువెంటనే వెళ్లి చనిపోయిన సైనికుల పేటికలవద్ద నివాళులర్పించారు. సైనికుల శవపేటికలను స్వయంగా ఆయన రవాణాకు తరలించేసమయంలో ఆయన భుజంపై వేసుకుని మోసారు. హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌, జమ్ముకాశ్మీర్‌గవర్నఱ్‌ సత్యపాల్‌మాల్లిక్‌లు అధికారులలో శ్రీనగర్‌లో సమావేశం ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షించారు. గవర్నర్‌ మాలిక్‌, హోంకార్యదర్శి రాజీవ్‌ గౌబా, సిఆర్‌పిఎఫ్‌ డైరెక్టర్‌జనరల్‌ఆర్‌ఆర్‌ భట్నాగర్‌, జమ్ముకాశ్మీర్‌ డిజిపి దిల్‌బాగ్‌సింగ్‌లతోపాటు ఇతర సీనియర్‌ అధికారులు అందరూ అమరజవాన్లకు నివాళిలో పాల్గొన్నారు. దేశం యావత్తు మన ధీరసైనికుల త్యాగాలను మరువదని సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల ధైర్యసాహసాలు వెలకట్టలేనివని హోం మంత్రి పేర్కొన్నారు. నాసోదరుడు దేశం కోసమే ప్రాణత్యాగం చేసాడు, దేశంకోసమే తన సోదరుడు నిలిచాడని, కేరళకు చెందిన వాయనాడ్‌నుంచి వచ్చి మిలిటరీలో పనిచేస్తూ పుల్వామా దాడుల్లో చనిపోయిన వివి వసంత్‌కుమార్‌ సోదరుడు సాజీవన్‌ వెల్లడించారు. వసంతకుమార్‌ తల్లి శాంత, భార్య షీనాలు మొత్తంశోకసముద్రంలోమునిగిపోయారు. మొత్తం 40 మంది కుటుంబాల్లో కూడా అంతులేని విషాం నెలకొంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు మిన్నంటాయి.పుల్వామాలో చనిపోయిన సైనికుల భౌతిక కాయాలను ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో తరలించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బిజెపి పాలిత రాష్ట్రాలముఖ్యమమంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరినీ వీరజవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబానికి నైతిక మద్దతునివ్వాలని ఆదేశించారు. విదేశాంగశాఖ పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకినిచేసే ప్రణాళికను ముమ్మరంచేసింది. జైషేముహ్మద్‌ సంస్థపైనా, ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అఝర్‌పైనా తక్షణ చర్యలుచేపట్టాలని డిమాండ్‌చేసింది. ఇదిలా ఉండగా నటి షబానా అజ్జీ, రచయిత జావేద్‌ అఖ్తర్‌ల కరాచి సాంస్కృతిక మండలి కార్యక్రమంలో పాల్గొనే పర్యటనను రద్దుచేసుకుంటున్నట్లుప్రకటించారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాలం విమానాశ్రయానికి చేరుకుని మృతుల శవపేటికలవద్ద ఘననివాళులర్పించారు. ఒడిశాప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఇద్దరికి రూ.10 లక్షలచొప్పున పరిహారం ప్రకటించింది.మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల రెండు కుటుంబాలకు రూ.50 లక్షలుచొప్పున పరిహారం ప్రకటించింది. త్రిపుర ప్రభుత్వం సిఆర్‌పిఎఫ్‌ మృతులకుటుంబాలకు రూ.రెండులక్షలుచొప్పునప్రకటించింది. మధ్యప్రదేశ్‌ప్రభుత్వం జవాను కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఆర్ధికసాయం ప్రకటించింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్‌,నేపాల్‌ ప్రతినిదులుసైతం విదేశాంగశాఖ మంత్రితో చర్చలుజరిపారు. యూరోపియన్‌ దేశాలు జర్మనీ, హంగరీ, ఇటలీ, యూరోపియన్‌ కూటమి ఇతర దేశాలు, కెనడా, బ్రిటన్‌, రష్యా, ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల రాయబారులు భారత విదేశాంగశాఖవద్దకు వచ్చి పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండించాయి. చైనా ప్రత్యేకప్రకటన విడుదలచేస్తూ ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తక్షణమే తుదముట్టించాల్సిందేనని పేర్పొంటూ పుల్వామా ఘటనను ఖండించింది. శ్రీనగర్‌లోని బేస్‌క్యాంప్‌లో ఉన్న ఆసుపత్రిలోచికిత్సలు పొందుతున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను హోంమంత్రి పరామర్శించారు. ఆర్మీ, సెక్యూరిటీ కాన్వా§్‌ులు వెళుతున్నపుడు ట్రాఫిక్‌ను నియంత్రించాలని హోం మంత్రి ఆదేశాలుజారీచేసారు. ఇదిలా ఉండగా వేర్పాటువాదులు ప్రకటనచేస్తూ కాశ్మీర్‌సమస్య పరిష్కారంలో జాప్యం వల్ల హింసాత్మక ప్రవృత్తిపెరిగిపోతున్నదని పేర్కొన్నారు.
చనిపోయిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్లలో 12 మంది ఉత్తరప్రదేశ్‌, ఐదుగురు రాజస్థాన్‌, నలుగురు పంజాబ్‌, ఇద్దరేసి చొప్పున మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఒడిశా; తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందినవారు. బీహార్‌నుంచి ఇద్దరు, అస్సాం, కేరళ, కర్ణాటక, జార్ఖండ్‌, ఎంపి, హిమాచల్‌ప్రదేశ్‌, జెఅండ్‌కెనుంచి ఒక్కొక్కరు చొప్పున మృతుల్లో ఉన్నారు. విదేశాంగశాఖ కార్యదర్శి అన్ని దేశాల రాయబారులను కలుసుకుంటున్నారు. వారిలో చైనా రాయబారి ల్యూజావోయిని కూడా కలిసి వారిపై పాక్‌ ఘటనను ఖండించారు. దక్షిణ కొరియా విదేశాంగశాఖ ఒక ్పకటన విడుదలచేస్తూ పుల్వామాలోని భారీ ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాప సానుభూతులను వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా పంజాబ్‌ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌మాట్లాడుతూ పాకిస్తాన్‌తో శాంతిచర్చలుజరపాలన్న పర్వం ఇకముగిసిపోయిందని, ఇక గుణపాఠం చెప్పడమే తరువాయి అని పేర్కొన్నారు. శివసేన ప్రతినిదులు మాట్లాడుతూ పార్లమెంటు సంయుక్త సమావేశాలను తక్షణమే ఏర్పాటుచేసి పుల్వామా ఘటనపైచర్చించాలని ఎంపి సంజ§్‌ురౌట్‌ పేర్కొన్నారు.