ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Counting of votes
Counting of votes

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుంచి ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ ప్రారంభించారు. అత్యంత పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల సమరాంగణంలో హోరాహోరీన తలపడిన అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య పండగలో ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు ఫలితాల కోసం ఉద్వేగంతో వేచి చూస్తున్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశ శాసనసభలకు జరిగిన ఎన్నికలు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.
తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో కౌంటింగ్‌ మొదలవుతుంది. ఏపిలో అధికార టిడిపి, విపక్ష వైఎస్‌ఆర్‌సిపి గెలుపు తమదేనని బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఓటరు తీర్పు ఎలా ఉందోనన్న గుబులు రెండు పార్టీల్లోనూ ఉంది. ఈ ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగడంతో గెలుపు ఎవరిదన్న అంచనా చిక్కక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులతో పాటు ప్రజలంతా తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/