టీచర్ల బదిలీల్లో అంతా గందరగోళం!

  Councelling
Councelling

టీచర్ల బదిలీల్లో అంతా గందరగోళం!

హైదరాబాద్‌: సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన గురువులే..అక్రమాల బాట పట్టారు. భోగస్‌ మెడికల్‌ సర్టిఫికేట్లు.. సీనియారిటీలో ముందుండాలని తప్పుడు ధృవ పత్రాలు సమర్పించారు. తద్వారా దొడ్డిదారిన అమకు అనువైన చోటికి బదిలీ చేయించుకునేం దుకు అన్నీరకాల అడ్డదారులు తొక్కుతోన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల్లో అంతా గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కేటగిరి 4 పై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రవాణా, రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను ఈ4 కేటగిరీలో ఉంచారు. వీరికి మిగతా 3 కేటగిరీల కంటే కొంత ఎక్కువ మార్కులు కేటాయించారు.