మరో సిరియాగా వెనిజులాని చూడలేం

syria
syria


మాస్కో: రష్యాలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలపై రష్యా స్పందించింది. లాటిన్‌ అమెరికా దేశమైన వెనిజులా దేశంలో అమెరికా జోక్యం తగదు అని రష్యా పేర్కొంది. రష్యాలో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మధురోను కూలదోసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం విస్తృతమైంది. ఇప్పటికే పశ్యిమాసియా, ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి దేశాల్లో అమెరికా జోక్యం గురించి వేరే చెప్పక్కర్లేదు.
ఐతే వెనిజులాకు, అమెరికాకు ఏనాటి నుంచో వైరాలున్నాయని, అందుకే వెనిజులాలో అమెరికా జోక్యం తగదని రష్యా భావిస్తుంది. వెనిజులాను మరో సిరియాగా చూడలేమని అందుకే ముందు జాగ్రత్తగా ఆ దేశానికి హితం కోరి చెబుతున్నామని రష్యా చెప్పుకొచ్చింది. అమెరికా విధానాల్ని తాము ఎంత మాత్రమూ సమర్ధించబోమని రష్యా స్పష్టం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/