దగ్గు తగ్గాలంటే…

ఆరోగ్య సంరక్షణ

Cough

సహజంగా వచ్చే దగ్గు, జలుబులను ఈ క్రింది చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు .. కరక్కాయ పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ రసాన్ని కొద్దీ కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు తగ్గిపోతుంది.. చేదుగా వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్ని ఇస్తుంది..

గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలుకల పొడి , లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కన్పిస్తుంది… ఒకేలా అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకునే ప్రతిరోజు ఉదయం , సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివలన కలిగే ఆయాసం కూడా తగ్గుతుంది.

గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలకలు పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖ నిద్ర పడుతుంది.

అలాగే, మిరియాల కషాయం కూడా దగ్గుని , జలుబుని తగ్గించటంలో సహాయ పడుతుంది… ఒక స్పూన్ తులసి ఆకుల ఆ రసం సమపాళ్ళలో తేనె కలిపి వాడితే కఫమ్ వలన వచ్చే దగ్గు తగ్గి, ఉపశమనం కల్గిస్తుంది. శొంఠి ని నీళ్లలో కలిపి కషాయంగా కానీ , అందులో బెల్లం కలుపుకుని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు, జలుబు త్వరగా తగ్గుతుంది.


అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/