ఆయన లోపాలను సరిదిద్దుకోండి

‘వ్యధ’ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

Correct husband errors
Correct husband errors

ప్రతి యువతి మంచి భర్త కావాలని కలలు కంటుంది. ఇల్లాలు కాగా నే ఇంటిని స్వర్గతుల్యం చేసుకోవాని ఆశిస్తుంది. భర్తనే సర్వస్వంగా భావిస్తుంది.

భర్త ప్రేమను పంచుకోవాలని, పండంటి పిల్లల్ని కనాలని తపి స్తుంది. భర్తకు తోడుగా ఉంటూ, అతని నీడలో సుఖపడాలని కోరుకుంటుంది.

భర్తకు అనురాగాన్ని, పిల్లలకు వాత్సల్యాని పంచుతూ కలకాలం కమ నీయ దాంపత్యాన్ని సాగించాలన్న లక్ష్యం ఏర్పరచు కుంటుంది.

అత్తలో తల్లిని ఆడపడుచుల్లో స్నేహితు రాళ్లను చూడాలనుకుంటుంది. ఇన్ని ఆశలు, ఆరికాంక్ష, భావాలు, అనుబంధాలలో యే ఒక్కటి లభించకపోతే ఆ స్త్రీ మానసిక స్థితి ఏమౌతుంది?

దిగులు, డిప్రెషన్‌, నిరాశ, నిస్పృహ ఆవహించి ఆత్మహత్యే శరణ్యామని భావించదా? ఆ పరిస్థితుల్లో సర్దు బాటు, సహనం, ఓర్పు, నేర్పు అంటూ తల్లితండ్రులు హితోపదేశాలు చేస్తే ఎలా ఉంటుంది?

పెళ్లి పేరుతో నరకంలోకి నెట్టిసిన తల్లితండ్రులపై కోపంరాదా? పనికిరాని భర్త, పగబట్టిన అత్త, ద్వేషం వెల్లగక్కే ఆడపడుచులను తట్టుకుని బతకడం సాధ్యమేనా?

సాధ్యం కాక చాలా మంది ఇల్లాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారన్నది నా అభిప్రాయం.

అందుకే నాకూ చాచ్చిపోవాలని ఉంది. అయితే అందుకు దైర్యం చాలకనో, ఏదో మూల మినుకు మినుకు ఆశవల్లనో ఇంకా బతికి ఉన్నాను.

నా సమస్యకు మీరు చక్కని పరిష్కారం అందిస్తారని ఆశిస్తాను. నా వయస్సు 27 సంవత్సరాల, బి.టెక్‌ పాసయ్యాను. మాది మధ్య తరగతి వ్యవసాయకుటుంబం. అమ్మ, నాన్నలు కష్టపడి నన్ను తమ్మున్ని పెంచి పెద్ద చేశారు.

మంచి సంబంధమని నెలకు లక్షరూపాయల జీతం తెచ్చుకునే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుకు ఇచ్చి పెళ్లి చేశారు. వారిది కొంత ఉన్న కుటుంబమే.

దీంతో మా స్నేహితురాళ్ల అందరూ నన్ను అదృష్ట వంతురాలినని పొగిడారు. అయితే శోభనం రాత్రే ఆ మనసు కలుక్కుమంది. రిసెప్షను, తిరుగుళ్లు వల్ల అలసి పోయానని చెప్పి నిద్రపోయారు.

శోభనపు మాధుర్యం జీవితాంతం మూటకట్టుకోవాలని తలపోసిన నాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దుఃఖాన్ని దిగమింగుకుని అలసిపోయేవరకు అటు ఇటు తిరిగి నేనూ నిద్రపోయాను. తెల్లారిన శోభనం రాత్రి ముగిసి, తెల్లవారిన తరువాత ఆరాలు తీసే ప్రయత్నం చేసిన పెద్దలకు అన్యమనస్కంగా సమాధానాలు చెప్పారు. మా వాలకం చూసిన మా అమ్మ, అత్తకు విషమం అర్థమయ్యింది. బుజ్జిగించి నా వద్ద నిజం తెలుసుకున్నారు.

మా అమ్మ ఫరవాలేదని, ఆకట్టుకుని దగ్గరవ్వాలని హింతవ్ఞ చెప్పింది. మా అత్త మాత్రం నాదే తప్పయినట్టు కొడుకును వెనకేసుకొచ్చింది. మా వారికున్న ఇద్దరు అక్కలు, వారి అమ్మతోకలసి నాలో ఏదో లోపం ఉందని, నేను భర్తకు సహకరించి ఉండనని నిర్ధారణకు వచ్చారు.

మా వారు తనలోపాన్ని కప్పి పుచ్చకోడానికి నన్ను చూస్తే కోర్కెలు కలుగలేదని అబద్ధాలు చెప్పారు. తనస్థాయికి తెలివి తేటలకు నేను తగని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో అందరు నన్ను తక్కువచేసి మాట్లాడటం ప్రారంభంచారు.

వారంలో ఇద్దరం కలసి ఆయన పనిచేస్తున్న బెంగళూరులో కాపురం పెట్టాము. అప్పటి నుంచి ఆయనకు ఒంటమనిషిగా మారాను. ప్రేమ, అనురాగం, ముద్దు, ముచ్చట స్థానంలో కోపం, చిరాకు అవహేళనలు, చీవాట్లు చవిచూస్తూ ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నాను.

అతని లోపం వల్ల దాంపత్య సుఖాలు మృగ్యం అయ్యింది. ఇక పిల్లలు పుట్టే యోగం లేదనిపిస్తోంది. డాక్టర్ల వద్ద చూపిస్తే ఒత్తిడి తగ్గించుకోమని, జీవనశైలి మార్చుకోమని సలహాలు ఇచ్చారు. అయినా మార్పు రాలేదు.

అత్త, ఆడపడుచులు ఇప్పటికీ నాదే తప్పన్నట్లు మాట్లాడుతున్నారు. అమ్మ నాన్నలకు చెపితే సర్దుకుంటేనే సంసారం సాగుతుందంటున్నారు.

విడాకులు తీసుకుందామంటే మళ్లీ పెళ్లీకాదని భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నా జీవితం చక్కబడేమార్గం చెప్పండి.

– కౌసల్య, విశాఖపట్నం

అమ్మా మనోవ్యథను అర్థం చేసుకున్నాను. ఆధునిక యువ దంపతులలో మీలా బాధపడుతున్నవారు అక్కడక్కడా తారసపడుతున్నారు.

మీలాంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆధునిక జీవన శైలి, మానసిక, శారీరక అంశాలు, ఇతర సమస్యల ప్రభావాల వల్ల స్వర్గతుల్యం కావాల్సిన దాంపత్యం నరకాన్ని తలపిస్తోంది.

ఇప్పటికీ ఆడపిల్లలు అంటే భార్యలు అన్నింటికి సర్దుకుని కాపురం చేయాలన్న భావన మన సమా జంలో ఎక్కువగా కనిపిస్తోంది.

సర్దుబాటు, సహనం ఓర్పు అన్నవి నిజానికి బలీయమైన మానసిక అంశాలే అయితే ప్రతి చోట ఉత్తమం గా చెప్పలేము.

సమస్యలు ఎదురైనపుడు పరిష్కారమార్గాలు అన్వేషించి సరిద్దుకోవాల్సి తప్ప సర్దుబాటుతో సరిపెట్టుకో వాల్సిన అవసరం లేదు.

మీ లాంటి వారికి తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ప్రతి దాని ఒక పరిమితి అంటూ ఉంటుంది.

మీ విషయం పరిశీలిస్తే మీ తల్లిదం డ్రులు అత్తమామలు, ఆడపడుచులు సమస్యను సరిగా అర్థం చేసుకోలేదని అనిపిస్తోంది.

మీ భర్త సమస్య సరిదిద్దడంకంటే వారి ఆధిక్యత చాటుకోవడం లేదా ఈ భర్తలోపాన్ని కప్పి పుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తోంది.

నిజానికి ఈ వారి సమస్య చాలా సున్నితం, సుళబంగా పరిష్కారం అవ్ఞతుంది. అతను సిగ్గు, బిడియం, భయం, ఆందోళన, ఆత్మమ్యానతలో కొన్నింటితో బాధపడుతుంటారు

. అలాగే జీవనశైలిలో లోపం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. శారీరక వ్యాయామా లు లేకపోవం వల్ల సామర్థ్యం తగ్గిపోయి ఉండవచ్చు.

అలాగే ఇంకేవైనా ఇతర కారణాలు మూలాలుగా మారవచ్చు.

అనుభవ సైకాలజిస్టు, లేదా ఎక్సాలాజిస్టు ద్వారా కౌన్సె లింగ్‌ లేదా చికిత్స చేయిస్తే సరిపోతుంది. సహజంగా ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి భర్తలు సంకోచిస్తుంటారు.

మీరు మీ వారితో మాట్లాడి అనునయంతో ఒప్పించి కౌన్సె లింగ్‌ లేదా చికిత్స చేయించండి. కాగ్నెటివ్‌ జివానియర్‌ థెరపి, రిలాక్సేషన్‌ పద్ధతులతో అతనిలో ఆత్మ విశ్వాసం పెంచే వారు.

ఒక వేళ హార్మోన్ల సమతుల్యత ఉంటే మందులు, చికిత్సతో చక్కదిద్దవచ్చు.

వీలును బట్టి ఓర్పుగా మీ అత్త మామలు, ఆడపడుచులు, తల్లిదం డ్రులకు వివరించి కౌన్సెలింగ్‌కు సమ్మతించేలా చూడండి. సర్దుబాటుకాకుండా భర్త లోపా లను సరిదిద్దుకోండి.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/