భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి

ఇమ్రాన్‌ ఖాన్‌పై చైనాలో గల పాకిస్థాన్‌ విద్యార్థులు ఫైర్‌

Pakistan students in china
Pakistan students in china

వూహాన్: కరోనా వైరస్ ధాటికి చైనాలో ఉన్న భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలిస్తుండగా అక్కడే చిక్కుకుపోయిన పాకిస్తాన్ విద్యార్థులు రోధించారు. తమను కూడా పాకిస్తాన్‌కు పంపాలంటూ అర్థిస్తున్నారు. అంతేకాదు వారిని కాపాడటంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ చిక్కుకున్న ఇతర దేశస్తులను ఆయా ప్రభుత్వాలు తిరిగి వారి దేశంకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులను మన ప్రభుత్వం ప్రత్యేక విమానంలో భారత్‌కు చేర్చింది.  అయితే పాక్ ప్రభుత్వం మాత్రం తమ విద్యార్థులను తీసుకొచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అక్కడ చిక్కుకున్న పాకిస్తాన్ విద్యార్థుల రోదనలు మిన్నంటాయి. కరోనా వైరస్ బారిన పడి బిక్కు బిక్కు మంటున్న విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంపై మండిపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వూహాన్ నుంచి భారతీయ విద్యార్థులను ఓ బస్సు తీసుకెళుతున్న వీడియోను పోస్టు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రశంసలు కురిపించారు. మీరు చనిపోయినా ఫర్వాలేదు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయం చేయలేదు అని చెబుతున్న పాక్ ప్రభుత్వంపై విద్యార్థులు విమర్శలు గుప్పించారు. భారత ప్రభుత్వం నుంచి మంచి అంటే ఏంటో నేర్చుకోండంటూ విద్యార్థులు హితబోధ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/