షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌ పర్యటన: సౌతాఫ్రికా

South Africa national cricket team
South Africa national cricket team

కేప్‌టౌన్‌: ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా దీని ప్రభావం భారత్‌ పర్యటనపై దక్షిణాఫ్రికా సానుకూలంగా స్పందించింది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే తాము భారత్‌కు రానున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ స్పష్టం చేసింది. కరోనా తాము భయంతో పర్యటనను రద్దు చేసుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌కు పర్యటనకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దుబాయ్‌ మీదుగా ఇండియాకు రానున్నట్లు తెలిపింది. ప్రత్యేక విమానాల ద్వారా మ్యాచ్‌లు జరిగే ప్రదేశాలకు ప్రయాణిస్తామని స్పష్టం చేసింది. మరో రెండుమూడు రోజుల్లో భారత్‌ పర్యటనకు సఫారీలు రానున్నారు. మార్చి 12వ తేదీన ధర్మశాల వన్డేతో ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. మార్చి 15వ తేదీన లక్నోలో రెండో వన్డే, మార్చి 18వ తేదీన కోల్‌కతాలో మూడో వన్డే జరుగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/