కరోనాపై ప్రధాని తాజా ట్వీట్

కేంద్రమంత్రులెవరూ విదేశాల్లో పర్యటించబోరు

pm modi
pm modi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భారత్‌లో రోజురోజుకూ విస్తరిస్తుంది. ఈనేపథ్యంలో ప్రధాని మోడి కరోనావైరస్‌కు సంబంధించి ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కరోనాపై ట్వీట్ చేసిన మోడి.. ప్రజలు ఆందోళన చెందవద్దని.. జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రమంత్రులెవరూ విదేశాల్లో పర్యటించబోరని ట్వీట్‌లో పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయకూడదని, రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించచ్చని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. కరోనా వైరస్ 120కి పైగా దేశాలకు విస్తరించడంతో.. కరోనావైరస్‌ని ‘ప్రపంచ మహమ్మారి’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (జూబీవీ) గుర్తించిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్‌వో ప్రకటనతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని టూరిస్ట్ వీసాలను భారత్ రద్దు చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/