కరోనా ఎఫెక్ట్‌.. విదేశీ ఆటగాళ్లకు నో ఎంట్రీ

ఐపిఎల్‌ నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత

Carona Effect to IPL

ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం ఐపిఎల్‌ పై పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 15 వరకు విదేశీ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపిఎల్‌ నిర్వహణపై పలు అనునమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఐపిఎల్‌ జరుగుతుందా? లేదా? అన్నది త్వరలో తేలనుంది. గురువారం బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ… ‘ఐపీఎల్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు వాణిజ్య సంబంధిత వీసాలు జారీ చేస్తారు. ఐపీఎల్‌ నిర్వహణపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈనెల 14న ముంబైలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా శనివారం విషయం తెలియజేస్తాం. ఒకవేళ ఐపీఎల్‌ను వాయిదా వేస్తే.. ఏప్రిల్‌, మే తర్వాత విదేశీ ఆటగాళ్లు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. జాతీయ జట్లన్నింటికీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఐపీఎల్‌ను నిర్వహించాలంటే అభిమనులను స్టేడియంలోకి అనుమతించకుండా ఆడించడమే సరైన మార్గంగా కనిపిస్తోంది’ అని అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/