కరోనా అంత పెద్ద జబ్బేమీ కాదు..మైకేల్

వేరే జబ్బులతో పోలిస్తే మరణాల రేటు తక్కువని వెల్లడి

WHO

జెనీవా: ప్రపంచ దేశాలపై రోనా వైరస్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే కరోనా అంత పెద్దదేం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెవ్‌వో అత్యవసర విభాగాధిపతి మైకేల్ రయాన్ సూచించారు.

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపించిందని, మొదట్లో అది చాలా తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. కొన్ని కోట్ల మందికి సోకి లక్షలాది మందిని చంపేసిందని, చాలా మందిని అగాథంలోకి నెట్టేసిందని అన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న వేరే జబ్బులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువని చెప్పారు. కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సిందేమీ లేదన్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 16 లక్షల 84 వేల 429 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 17 లక్షల 81 వేల 823 మంది బలయ్యారు. కోటీ 97 లక్షల 81 వేల 718 కేసులు, 3 లక్షల 43 వేల 182 మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. కేసుల్లో ఇండియా, మరణాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/