3 వేలు దాటిన కోవిడ్‌-19 మృతుల సంఖ్య

చైనాలో ఒక్కరోజే 42 మంది మృతి

COVID-19 toll passes 3,000, more
COVID-19 toll passes 3,000, more

చైనా: ప్రపంచవ్యాప్తంగా వణుకుపుట్టిస్తున్న కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో నిన్న మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు రెండు నుంచి ఐదు శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో రెండుకు చేరింది. సింగపూర్‌లో ఉంటున్న జపాన్, మియన్మార్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నలుగురికి కోవిడ్ సోకింది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 106కు పెరిగింది. ఇటలీలో మృతుల సంఖ్య 34కు చేరుకోగా, బాధితుల సంఖ్య 1577కు చేరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/