ఫ్లూ కంటే కరోనా మరణాలు అధికం: డబ్ల్యూహెచ్‌ఓ

World-Health Organization
World-Health Organization

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మరణాల సంఖ్య సీజనల్ వ్యాధి ఫ్లూ కంటే ఎక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. అంతేకాదు, వ్యాధినిరోధకత తక్కువగా ఉన్నవారికి కోవిడ్ సోకితే ఫ్లూ కంటే ముప్పు అధికమని తెలిపింది. అంచనా వేసిన కంటే ఎక్కువ మంది ప్రజలు కరోనా వైరస్ బారినపడుతున్నారని, కొంత మందిలో తీవ్రత అధికంగా ఉందని ప్రస్తుత గణాంకాలు సూచిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడి ఇప్పటికే 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా సీజనల్ ఫ్లూతో ఒక్క శాతం కంటే తక్కువ మంది మృతిచెందితే.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో దాదాపు 3.4 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘోబ్రియోసిస్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/