భారత్ ఆటో పరిశ్రమపై కరోనా ప్రభావం!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపుతూ, చైనా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది కరోనా వైరస్. దీని ప్రభావం తాజా గా భారత ఆటో రంగంలోను గుబులు పెంచింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా వాహన విడిభాగాల సరఫరాలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వాహన తయారీదారుల సంఘం సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. గతవారం జరిగిన ఆటో ఎక్స్పో, ఆటో కాంపోనెంట్స్ ఎక్స్పోలకు చైనాలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరు కాకపోవడం ఇందుకు ఊతమిస్తోంది. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ భారత్లో వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించినా ఆ సంస్థ యాజమాన్యం కూడా ఈ ఎక్స్పోకు హాజరుకాలేదు. అంతేకాదు, హైమా పేరుతో వాహనాలను విక్రయించే ఎఫ్ఏడబ్ల్యూ గ్రూపు కూడా కరోనా వైరస్ కారణంగా భారత పర్యటనను రద్దు చేసుకుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/