కరోనా..ఇరాన్‌లో ఒక్కరోజే 49 మంది మృతి

కరోనా వైరస్ ప్రభావం చైనా తర్వాత అత్యంత తీవ్రంగా ఉంది ఇరాన్ దేశం పైనే
iran -corona virus
iran -corona virus

ఇరాన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌ -19) చైనాలో కాస్త తుగ్గముఖం పట్టినప్పటికి ఇతర దేశాల్లో మాత్రం ఈవైరస్‌తో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇరాన్‌లో కరోనాతో ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. కోవిడ్19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ జహాన్‌పూర్ ఆదివారం (మార్చి 8) తెలిపారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో అక్కడా, ఇక్కడా అని కాకుండా మొత్తం 31 ప్రావిన్సులకు కరోనా పాకింది. తన ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ ప్రభావం చైనా తర్వాత ఇరాన్ దేశం పైనే అత్యంత తీవ్రంగా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/