కరోనా భయం..54000 మంది ఖైదీలు విడుదల

ఇరాన్‌లో రెండు వారాల్లో 77మంది కరోనాతో మృతి..ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం

Iran temporarily frees 54,000 prisoners
Iran temporarily frees 54,000 prisoners

ఇరాన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచదేశాలను కలవరపెడుతుంది. ఈనేపథ్యలో ఇరాన్‌ ప్రభుత్వం 54000 మంది ఖైదీలను తాత్కాలికంగా వదిలేసింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కరోనా వైరస్సే. గుంపులుగా ఉండే చోట వైరస్ ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇరాన్ డాక్టర్లు చెప్పడం అందుకు తగ్గట్టే… జైళ్లలో ఖైదీలకు కరోనా వైరస్ సోకుతుండటంతో… తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని వదిలేసింది. ఐతే… వదిలే ముందు వాళ్లకు పరీక్షలు చేశారు. కొవిడ్ 19 వైరస్ నెగెటివ్ అని వచ్చిన వారిని మాత్రమే వదిలేస్తూ… బెయిల్ ఇచ్చినట్లుగా రాసుకున్నారు. ఈ ఖైదీలలో కరడుగట్టిన… ఐదేళ్లకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలను మాత్రం వదల్లేదు. ఇరాన్‌లో చాలా మంది సీనియర్ అధికారులకు కూడా ఇది సోకింది. పార్లమెంట్‌లోని 290 మంది ఎంపీల్లో 23 మందికి కరోనా సోకింది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో కరోనా వైరస్ ఉంది. కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్ష దాటింది. మృతుల సంఖ్య 3110 దాటినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పది దేశాల్ని పరిశీలిస్తే… అవి చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్, అమెరికాగా నమోదయ్యాయి. ఇరాన్‌లో రెండు వారాల్లో 77 మంది చనిపోయారు. మంగళవారం కొత్తగా 835 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలింది.


తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/