గంగూలీ కుటుంబంలో కరోనా వైరస్
సోదరుడు స్నేహాశీష్ భార్యకు కరోనా

New Delhi: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో గంగూలీ సోదరుడు స్నేహాశీష్ భార్యకు కోవిడ్ 19 వైరస్ సోకినట్లు ఆరోగ్య రాష్ట్ర విభాగం తెలిపింది.
నివేదిక ప్రకారం స్నేహాశీష్ అత్తమామలకు కూడా గతవారం కరోనా సోకింది. ఈ నలుగురూ కోవిడ్ 19 లక్షణాలను పోలిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు.
దీంతో వీరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల ఫలితాలను అనుసరించి వీరిని డిశ్చార్జ్ చేసే విషయం ఆధారపడి ఉంటుందని వైద్యులు తెలిపారు.
కాగా గంగూలీ బెహాలాలోని తమ పూర్వీకుల ఇంట్లో నివసిస్తుండగా స్నేహాశీష్ మరోప్రాంతంలో నివసిస్తు న్నారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/