నేను చైనా నుంచి రాలేదు.. నాకు కరోనా లేదు

కనిపించకుండా పోయానంటూ ప్రచారం సరికాదు: చిత్తూరు వాసి

Coronavirus in india
Coronavirus in india

చిత్తూరు: చైనా నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ… తానసలు చైనా నుంచి రాలేదని, ఆస్ట్రేలియా నుంచి వచ్చానని స్పష్టం చేశారు. తాను బెంగళూరులో పనిచేస్తున్నానని, తమ సంస్థ తరఫున ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా పనిచేస్తున్నానని ఆయన వివరించారు. రెండు వారాల సెలవులు రావడంతో తాను భారత్‌కు వచ్చానని చెప్పారు. ఇటీవలే తాను ఆస్ట్రేలియా నుంచి మలేషియా మీదుగా బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. విమానం దిగిన వెంటనే అధికారులు కూడా తనిఖీ చేశారని, తనకు కరోనా వైరస్‌ లేదని చెప్పారు. అయితే, తన గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వాధికారలు తన వ్యక్తిగత విషయాలను సేకరించడం సరికాదని వాపోయారు. కరోనా వ్యాప్తి నేపథ్యలో బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన కనిపించకుండా పోయాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజా తెర-సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/