భారత్ లో కరోనా విజృంభణ

24 గంటల్లో 10 వేల కేసులు

Coronavirus in India

New Delhi: భారత్‌లో వరుసగా ఏడో రోజు కూడా 10వేలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8గంటలనాటికి రికార్డుస్థాయిలో 9,987 కేసులు, 266 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ క్రమంలో భారతదేశంలో కోవిడ్‌ 19 కారణంగా మరణించినవారి సంఖ్య 7,466కు పెరిగింది.

అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే తరువాత కోవిడ్‌ 19 మహమ్మారితో దెబ్బతిన్న ఐదవదేశం భారత్‌ అని జాన్స్‌హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం గణాంకాలు తెలుపుతున్నాయి.

కాగా కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,29,917 ఉండగా, 1,29,214మంది కోలుకున్నారు. ఒక పేషెంట్‌ వలస వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు 48.47 శాతం మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. ధ్రువీకరించిన కరోనా కేసుల్లో విదేశీయులు సైతం ఉన్నారు.

మంగళవారం ఉదయం వరకు నమోదైన 266 మరణాల్లో మహారాష్ట్రలో 109, ఢిల్లిలో 62, గుజరాత్‌లో 31, తమిళనాడులో 17, హర్యానాలో 11, పశ్చిమ బెంగాల్లో 9, యూపీలో 8, రాజస్థాన్‌లో6, జమ్మూలో 4, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్‌లో 2, పంజాబ్‌లో 2, బీహార్‌, కేరళలో ఒక్కొక్కరు మరణించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/