రికార్డు స్థాయిలో 1,61,736 కరోనా కేసులు
879 మంది మృతి

New Delhi: దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,61,736 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 879 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,71,058కి చేరింది.
సోమవారం దేశవ్యాప్తంగా14 లక్షల 122 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడి చేసింది .అదేవిధం గా 40.04 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి దాకా మొత్తం 10.85 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్టు తెలిపింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/