ఏపీలో కరోనా విజృంభణ

226 పాజిటివ్ కేసులు

Amaravati: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు పెరిగింది.

తాజాగా పెరిగిన కేసులలో ఒంగోలులో 2, చిత్తూరులో 7, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క కర్నూలు జిల్లాలోనే 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

శనివారం రాత్రి 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మీడియా బులెటిన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరుకుంది.

ఒంగోలులో 02, చిత్తూరు 07, కర్నూల్ 23, నెల్లూరు 02 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/